Choose Color Theme:
orange green violet red white

Latest News

Chedirina Paadamudralu - చెదరిన పాదముద్రలు

ATA 2024 Prize Winning Novel

 

చెదరిన పాదముద్రలు

ఉణుదుర్తి సుధాకర్

 

తెలుగు సాహిత్యంలో కల్పనకీ, ఈ కాలంలో జరుగుతున్న వాస్తవ సంఘటనలకీ ఉన్న ప్రాముఖ్యత మన గత చరిత్రమీద అంతగా కనిపించదు. కాస్త కరకుగా చెప్పాలంటే స్వాతంత్ర్య కాలం నాటి చరిత్రనే మనం అక్షరబద్ధం చేసుకోలేకపోయాం. వెనక్కి తిరిగి చూస్తే తెలుగువారికున్న చరిత్ర--ప్రత్యేకంగా వలసదారులది--చాలా ఎక్కువ. చారిత్రక నవలలు రాయడం కత్తిమీద సాము లాంటిది. చరిత్రని వక్రీకరించకుండా, కాల్పానికత చేకూర్చడం అంత సులభం కాదు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా నవలా రచన గాడి తప్పుతుంది. 

శ్రీ ఉణుదుర్తి సుధాకర్ రాసిన ఈ నవల, తెలుగువారికి, ప్రత్యేకంగా బర్మా దేశంలో రంగూన్‌కీ వున్న చరిత్రా, అందులో భాగంగా అప్పట్లో అనేక కుటుంబాలు ఎదుర్కున్న సంఘటనలూ, ఇవన్నీ నవలా రూపంలో చిత్రీకరించడం వలన ఈ రచనకి బహుమతి అర్హత కలిగింది. చరిత్రా, కాల్పనికతా సమపాళ్ళలో కలిసినపుడు ఆ నవలా రచన మరో స్థాయికి వెళుతుంది. 

అదే ఈ నవలని బహుమతికి అర్హతగా నిలబెట్టింది.  -సాయి గొర్తి బ్రహ్మానందం

Publisher: American Telugu Association

For copies in India:

https://www.telugubooks.in/collections/telugu-novels/products/chedarina-paadamudralu

top